Breaking News

పరీక్షలేకుండానే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలు..


Published on: 07 Jan 2026 17:19  IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ డీఎంఈల పరిధిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధు ల నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవల నియామక బోర్డు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 220 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 8, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడా నికి అవకాశం ఉంటుందని బోర్డు పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి