Breaking News

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌


Published on: 13 May 2025 17:14  IST

కోల్‌కతాలోని ‘ది నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో’ కోల్‌కతా నుంచి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయ అధికారులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. వెంటనే విమానంలోని ప్రయాణికులని, లగేజీని కిందికి దింపేశారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి