Breaking News

ITI విద్యార్థులకు బంపర్ ఆఫర్: కొచ్చిన్ షిప్‌‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో 260 ఖాళీలు! ఫిబ్రవరి 7 లోపు ఛాన్స్..

ITI విద్యార్థులకు బంపర్ ఆఫర్: కొచ్చిన్ షిప్‌‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో 260 ఖాళీలు! ఫిబ్రవరి 7 లోపు ఛాన్స్..


Published on: 23 Jan 2026 18:28  IST

కొచ్చిన్ షిప్‌‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్, అవుట్‌‌ఫిట్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 07.

ఖాళీలు: 260.

విభాగాల వారీగా ఖాళీలు: ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్  113 (షీట్​మెటల్ వర్కర్ 64,వెల్డర్ 49).

అవుట్​ఫిట్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ 147 (ఫిట్టర్ 39, ఎలక్ట్రీషియన్ 21, మెకానిక్ డిజిల్ 16, మెకానిక్ మోటార్ వెహికల్ 16, ఎలక్ట్రానిక్ మెకానిక్ 13, పెయింటర్ 11, మెషినిస్ట్ 10, క్రేన్ ఆపరేటర్ 06, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 06, ప్లంబర్ 05, షిప్​రైట్ వుడ్ 04).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 21.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 07.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.cochinshipyard.in వెబ్​సైట్​ను సంప్రదించండి.

Follow us on , &

ఇవీ చదవండి