Breaking News

ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.ఐఎండీ ముందస్తు హెచ్చరికలు

తెలంగాణ ప్రభుత్వం హీట్‌వేవ్ , సన్ స్ట్రోక్‌లను రాష్ట్ర నిర్దిష్ట విపత్తులుగా ప్రకటించింది. వడదెబ్బతో మరణించిన వారికి ఎస్‌డీఆర్ఎఫ్(స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) కింద అపద్బంధు పేరుతో రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.


Published on: 15 Apr 2025 14:51  IST

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రతగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ (IMD) సూచించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.  తాజాగా ప్రభుత్వం హీట్‌వేవ్ (వడగాలులు) , సన్ స్ట్రోక్‌ (వడదెబ్బ)లను రాష్ట్ర నిర్దిష్ట విపత్తులుగా (స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్) ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇప్పటివరకు ఇచ్చే రూ. 50,000 ఎక్స్‌గ్రేషియాను పెంచుతూ,ఆపద్భంధు పేరుతో ఇకపై ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ పరిహారం రాష్ట్ర విపత్తు  ప్రతిస్పందన నిధి (SDRF) నుండి ఇవ్వనున్నారు.ఈ పరిహారం పెంపుదల వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కొంతైనా ఆర్థిక భరోసా కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం – వేసవిలో ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా ఉండబోతున్నదని వాతావరణ శాఖ ఐఎండీ ముందస్తు హెచ్చరికలు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సంకేతాన్నిచ్చాయి.. ప్రజల ఆరోగ్యాన్ని  భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ చర్యలు చేపట్టింది.వడదెబ్బ వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే.. బాధితులకు తక్షణ సహాయం అందించడానికి.. వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకుంది. 

ప్రజలకు సూచనలు:

  • మధ్యాహ్న వేళలు ఎక్కువ ఎండగా ఉండే సమయం, ఆ సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించండి.

  • తరచుగా నీరు తాగండి,అవసరమైతే  ఒఆర్ఎస్ తీసుకోవాలని సూచించింది.

  • వదులుగా ఉండే దుస్తులు ధరించండి.

  • ఎండలో పనిచేసే వారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని, పనిచేస్తున్నప్పుడు మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ,శరీరాన్ని చల్లబరుచుకునే ప్రయత్నాలు చేయాలని సూచించింది.

ఈ జాగ్రత్తల ద్వారా వడదెబ్బతో వచ్చే ప్రాణనష్టం, ఆరోగ్యపరమైన ఇబ్బందులను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి