Breaking News

ఆరోగ్య బీమా (మెడిక్లెయిమ్) ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా చేయడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్‌ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్‌ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.


Published on: 15 Apr 2025 16:15  IST

దేశంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య బీమా (మెడిక్లెయిమ్) ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా చేయడంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బీమా క్లెయిమ్‌ల ఆమోదాన్ని ఒక గంటలో పూర్తి చేయాలి, తుది సెటిల్‌మెంట్‌ను మూడు రోజుల్లో పూర్తిచేయాల్సిందిగా యోచిస్తోంది.

ప్రజలకు అనువుగా బీమా క్లెయిమ్, అప్లికేషన్ ఫారమ్‌లను సులభంగా అర్థం అయ్యేలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మార్గదర్శకాల ప్రకారం రూపొందించనుంది. 2047 నాటికి ప్రతి భారత పౌరుడికి ఆరోగ్య బీమా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది.ఇంకా మెడిక్లైయిమ్ సిస్టమ్‌ను డిజిటల్‌గా వేగవంతం చేయడానికి "నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్" అనే ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఇప్పటివరకు 34 బీమా కంపెనీలు, 300 ఆసుపత్రులు ఈ నెట్‌వర్క్‌లో చేరాయి. దేశవ్యాప్తంగా 2 లక్షల ఆసుపత్రులను ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం చేయడమె కేంద్రం ప్రభుత్వ లక్ష్యం.

ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో బీమా క్లెయిమ్‌లు పూర్తిగా తిరస్కరణకు గురవుతున్నాయి,దీనిపై నియంత్రణ అవసరం అని కేంద్రం భావిస్తోంది. ఇక, క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించేందుకు బీమా నియంత్రణ సంస్థ 2024లో కొత్త నియమాలు విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి