Breaking News

భారీ నష్టాలు ఎదుర్కొంటున్న అమెరికా పరిశ్రమలు, వ్యాపారాలు

రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి(Tariff War) తెరలేపిన విషయం తెలిసిందే.


Published on: 17 Apr 2025 15:48  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పదవిలోకి రాగానే వాణిజ్య విధానాల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చారు. ప్రపంచంలోని పలు దేశాలపై, ముఖ్యంగా భారత్‌, చైనా వంటి కీలక దేశాలపై ప్రతీకారాత్మక సుంకాలను విధించడం ద్వారా వాణిజ్య పోరుకు శ్రీకారం చుట్టారు. ఈ చర్యల వల్ల అమెరికాలోని పరిశ్రమలు, వ్యాపారాలు భారీగా నష్టాలు ఎదుర్కొంటున్నాయి.ఇప్పటికే అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా రాష్ట్రం ట్రంప్ విధానాలపై న్యాయపోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా కేంద్ర బ్యాంకు (ఫెడ్‌) చైర్మన్ జెరోమ్‌ పావెల్‌ కూడా ట్రంప్‌ విధానాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ట్రంప్ సర్కార్ తీసుకున్న సుంకాల నిర్ణయాలు ఊహించినదానికంటే ఎక్కువగా ఉండటం గమనార్హం అని పావెల్ తెలిపారు. ఈ విధానాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఫెడరల్ రిజర్వు విధానాలకు ఈ చర్యల వల్ల నష్టం కలిగించినట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విధమైన టారిఫ్ విధానాలు దేశ ఆర్థిక భద్రతను దెబ్బతీసేలా ఉన్నాయని, దీర్ఘకాలికంగా మార్కెట్లపై దుష్ప్రభావం చూపవచ్చని ఆయన అన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే దేశంలో ఆందోళనను పెంచుతున్నాయని, వాటి ప్రభావం ఇంకా స్పష్టంగా బయటపడాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి