

మానవత్వం మంటగలిసి పోతోంది.కొందరు కామాంధులు పశువులకన్నా హీనంగా ప్రవర్తిస్తూన్నారు
ఉత్తర ప్రదేశ్‌లో అమానవీయ ఘటన: చెవిటి మరియు మూగ సమస్యతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలికను మానసికంగా, శారీరకంగా హింసించినా దుర్మార్గుడు
Published on: 17 Apr 2025 13:02 IST
రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోంది. కొందరు కామాంధులు పశువులకన్నా హీనంగా ప్రవర్తిస్తూ బాలల భద్రతను సవాల్‌గా మార్చుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన దీనికి నిదర్శనం.
రాంపూర్ జిల్లాలో చెవిటి మరియు మూగ సమస్యతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలిక మంగళవారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది. తీవ్ర ఆందోళనతో ఆమె కుటుంబ సభ్యులు గాలించారు. చివరికి బుధవారం ఉదయం పొలాలలో ఆమె నగ్న స్థితిలో, గాయాలతో కూలిపోయి కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం మీరట్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
పోలీసులు కేసు నమోదు చేసి, ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ అనే 24 ఏళ్ల యువకుడు పై అనుమానాలు వచ్చాయి. అతడ్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు ఎదురైన ప్రతిఘటనకు షాక్ అయ్యారు – తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. బులెట్ అతడి తొడలోకి దూసుకెళ్లింది. చికిత్స అనంతరం అతడ్ని స్టేషన్‌కు తరలించనున్నారు.
బాలిక పరిస్థితి విషమం
డాక్టర్ల ప్రకారం, బాలికపై శారీరకంగా హింసించడంతో పాటు పదునైన వస్తువులతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ‘ఒకరే కాదు, ఒకటి కంటే ఎక్కువ మంది ఇలా చేసిన అవకాశం ఉంది. చిన్నారి మాట్లాడలేకపోవడం వల్ల అసలు ఏం జరిగిందో వివరించలేకపోతోంది,’ అని వైద్యురాలు అంజు సింగ్ తెలిపారు.