Breaking News

సెప్టెంబర్ 16న చేయకున్నా నో ప్రాబ్లం.. ఇప్పటికైనా ITR ఫైల్ చేయవచ్చు..

సెప్టెంబర్ 16న చేయకున్నా నో ప్రాబ్లం.. ఇప్పటికైనా ITR ఫైల్ చేయవచ్చు..


Published on: 18 Sep 2025 10:22  IST

ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR) ఫైలింగ్ సీజన్‌ ముగిసిందనుకోవద్దు. సెప్టెంబర్‌ 16 తర్వాత కూడా ట్యాక్స్‌పేయర్లు తమ రిటర్న్‌ను ఆలస్యంగా ఫైల్‌ చేసే అవకాశం ఉంది. అసెస్‌మెంట్ ఇయర్‌ (AY) 2025-26, ఆర్థిక సంవత్సరం (FY) 2024-25కు సంబంధించి ITR డెడ్‌లైన్‌ను ముందుగా జూలై 31గా నిర్ణయించారు. అయితే CBDT పలు కారణాలతో మొదట సెప్టెంబర్‌ 15 వరకు, తరువాత మరో రోజు పొడిగిస్తూ సెప్టెంబర్‌ 16 వరకు ఫైల్ చేసేందుకు అవకాశం కల్పించింది.

డెడ్‌లైన్‌ మిస్‌ అయినవారు ఇకపై ‘బెలేటెడ్ రిటర్న్‌’ ద్వారా డిసెంబర్‌ 31, 2025 వరకు ఫైల్‌ చేయవచ్చు. అయితే ఆలస్యంగా ఫైల్‌ చేస్తే ఫైన్‌లు, వడ్డీలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు రిఫండ్‌లు కూడా ఆలస్యమవుతాయి.

ఎవరికెంత సమయం?

  • ఆడిట్‌ అవసరం లేని ట్యాక్స్‌పేయర్లు (ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు, సాధారణ వేతనదారులు) డెడ్‌లైన్‌ సెప్టెంబర్‌ 16వరకే.

  • ఆడిట్‌ అవసరమయ్యే వ్యాపార సంస్థలకు మాత్రం అక్టోబర్‌ 31 వరకు సమయం ఉంది.

  • ఇప్పుడు సెక్షన్‌ 139(4) ప్రకారం బెలేటెడ్‌ రిటర్న్‌ను డిసెంబర్‌ 31లోపు ఫైల్‌ చేయవచ్చు.

ఆలస్య ఫైలింగ్ ఫైన్‌లు, వడ్డీలు

  • సెక్షన్‌ 234F ప్రకారం, ఆదాయం రూ.5 లక్షలకంటే ఎక్కువ ఉంటే రూ.5,000 ఫైన్‌.

  • రూ.5 లక్షలలోపు ఉంటే కేవలం రూ.1,000 మాత్రమే.

  • ఉదాహరణకు: ఒక ఉద్యోగి వార్షిక ఆదాయం రూ.10 లక్షలు ఉంటే, ఆలస్యంగా ఫైల్‌ చేస్తే రూ.5,000 తప్పనిసరిగా చెల్లించాలి.

అంతేకాక, సెక్షన్‌ 234A ప్రకారం చెల్లించని పన్ను మొత్తంపై నెలకు 1% వడ్డీ కూడా వర్తిస్తుంది. ముందస్తు పన్ను (Advance Tax) చెల్లించని వారిపై ఇది మరింత పెరుగుతుంది.

ముఖ్య సూచన
ITR ఆలస్యంగా ఫైల్ చేస్తే రిఫండ్‌లు ఆలస్యమవుతాయి. HRA, హోమ్‌ లోన్‌ డెడక్షన్‌లు వంటి ట్యాక్స్‌ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఇకపై ఆలస్యం చేయకుండా త్వరగా ఫైల్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి