Breaking News

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026  ప్రదర్శన అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026 (Wings India 2026) ప్రదర్శన బుధవారం, జనవరి 28న అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్‌గా గుర్తింపు .


Published on: 28 Jan 2026 15:24  IST

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026 (Wings India 2026) ప్రదర్శన బుధవారం, జనవరి 28న అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్‌గా గుర్తింపు .

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ మెగా ఈవెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విమానాల స్టాటిక్ డిస్‌ప్లేను కూడా ఆవిష్కరించారు.ఈ ఈవెంట్ జనవరి 28 నుండి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది.

భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ గగనతల విన్యాసాలు ఈ ప్రదర్శనలో హైలైట్‌గా నిలుస్తున్నాయి.20కి పైగా దేశాల నుండి విమానయాన సంస్థలు, తయారీదారులు, 31కి పైగా విభిన్న రకాల విమానాలు ఈ షోలో పాల్గొంటున్నాయి.ఏవియేషన్ రంగంలో కెరీర్ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా కూడా నిర్వహిస్తున్నారు.

తొలి రెండు రోజులు (జనవరి 28, 29) కేవలం బిజినెస్ విజిటర్స్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది.

చివరి రెండు రోజులు (జనవరి 30, 31) సామాన్య ప్రజలను అనుమతిస్తారు.ఆసక్తి గల వారు Wings India Official Website ద్వారా లేదా BookMyShow ప్లాట్‌ఫారమ్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

Follow us on , &

ఇవీ చదవండి