Breaking News

డాడీ.. నేనిక డ్యాన్స్‌ చేయలేనా ?


Published on: 11 Feb 2026 15:35  IST

డాడీ నేను ఇక డాన్స్‌ లేయలేనా ? అన్న కుమారుడి మాటలకు ఓ తండ్రి చలించిపోయి బోరున విలపించాడు. సోమవారం పర్వతగిరి మండలం శ్రీనగర్‌ గ్రామ శివారులో పాఠశాల బస్సు, ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో కొంకపాక గ్రామానికి చెందిన రాజు కుమారుడు హర్షిత్‌ (10) తీవ్రంగా గాయపడ్డాడు. సంగెంలోని రోటరీ డామ్‌ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న హర్షిత్‌ బస్సు ముందుభాగంలో కూర్చున్నాడు. ప్రమాదంలో బస్సు గ్లాస్‌ పగిలి బస్సులో నుంచి బయటపడ్డాడు. కాలు రెండు చోట్ల విరిగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి