Breaking News

ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్..


Published on: 11 Feb 2026 15:48  IST

ఏపీ అసెంబ్లీలో రేపటి(గురువారం) ఏఐ ఆధారిత అటెండెన్స్ అమల్లోకి రానుందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా ప్రస్తుతం బయోమెట్రిక్ విధానాన్నే అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మీడియాతో అయ్యన్నపాత్రుడు చిట్‌చాట్ చేశారు. పార్లమెంట్‌లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని స్పష్టం చేశారు.ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి