Breaking News

వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి..


Published on: 11 Feb 2026 15:41  IST

వైసీపీ.. హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సమావేశానికి మూడు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైసీపీ నేతలు చేసే విధ్వంస కుట్రలను సమావేశంలో డిప్యూటీ సీఎం లేవనెత్తారు.

Follow us on , &

ఇవీ చదవండి