Breaking News

జో బైడెన్‌కు ‘క్యాన్సర్’ నిర్ధారణ.. !


Published on: 19 May 2025 11:40  IST

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధారనైంది. అది బైడెన్‌ శరీరంలోని ఎముకలకు కూడా వ్యాపించిందని, అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందని.. ఆయన కార్యాలయం ఆదివారం (మే 18) విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇటీవల బైడెన్‌ మూత్ర సంబంధ సమస్యలను ఎదుర్కోవడంతో గత శుక్రవారం ఆయనకు వైద్యులు పలు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి