Breaking News

కరోనా బారినపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్‌ హెడ్‌..


Published on: 19 May 2025 12:34  IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ఈ విషయాన్ని వెల్లడించాడు. హెడ్‌ కొవిడ్‌ బారినపడడంతో భారత్‌కు రావడంలో ఆలస్యమవుతుందని కోచ్‌ పేర్కొన్నాడు. అయితే, హెడ్‌కు ఎప్పుడు.. ఎక్కడ కరోనా వైరస్‌ వచ్చిందనే విషయాన్ని మాత్రం సన్‌రైజర్స్‌ కోచ్‌ సమాధానం ఇవ్వలేదు.

Follow us on , &

ఇవీ చదవండి