Breaking News

రూపాయి రికార్డు పతనం..సూచీలకు తప్పని నష్టాలు..


Published on: 01 Dec 2025 17:20  IST

డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (రూ.89.76) రికార్డు కనిష్టానికి పడిపోవడం మదుపర్లను కలవరపెట్టింది. దీంతో సూచీలకు నష్టాలు తప్పలేదు. ఉదయం భారీగా లాభపడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నేల చూపులు చూశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.

Follow us on , &

ఇవీ చదవండి