Breaking News

పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి


Published on: 10 Dec 2025 12:14  IST

ఓ యువకుడి ఆత్మహత్యను పరువు హత్య అని ఆరోపించిన అనంతపురం జిల్లా వైసీపీ నేత, మాజీ ఎంపీ తలారి రంగయ్యకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలను చూపించి, కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు. బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామానికి చెందిన బోయ ఆనంద్‌ (21) గత నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పరువు హత్య ఆధారాలు చూపాలంటూ పట్టణ సీఐ హరినాథ్‌ నోటీసులు జారీ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి