Breaking News

పాకిస్థాన్ ఓటమి.. సెమీస్‌కు భారత్


Published on: 02 Feb 2026 11:08  IST

అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్‌తో తీవ్రంగా నిరాశపర్చిన టీమిండియా కెప్టెన్ ఆయుశ్ మాత్రే.. బౌలింగ్‌లో అదరహో అనిపించాడు. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా టోర్నీలో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement