Breaking News

ఏపీకి ఏమిచ్చారంటే..!


Published on: 02 Feb 2026 11:58  IST

ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్‌, ఉత్పత్తి, పరిశోధన, క్రమబద్ధీకరణను ప్రోత్సహించేందుకు ఎర్త్ కారిడార్‌ నెలకొల్పుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె మూడుసార్లు ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రస్తావించారు. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ సహా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో సమగ్ర ఈస్ట్‌ కోస్ట్‌ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. విశాఖ-చెన్నై ఈ కారిడార్‌ కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు 2,500 కిలోమీటర్ల మేర విస్తరించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement