Breaking News

పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు


Published on: 05 Feb 2026 18:43  IST

ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌ జిల్లాలోని జఖపుర రైల్వే స్టేషన్‌ సమీపంలో చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. దీంతో మూడు బోగీలు పట్టాల నుంచి కిందకు జారిపోయాయి. రైలు భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు నెమ్మదిగా వెళుతుండటంతో పెను ప్రమాదం తప్పింది.సహాయక చర్యలు మొదలుపెట్టాయి. అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement