Breaking News

హైదరాబాద్‌ శివారులో కుండపోత వర్షం..


Published on: 11 Sep 2025 11:36  IST

నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపుర్‌ మెట్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది.

Follow us on , &

ఇవీ చదవండి