Breaking News

కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం..


Published on: 28 Oct 2025 15:17  IST

భారీ వర్షాలు కురుస్తూ వరి ధాన్యం నీటిపాలైతున్నా ప్రభుత్వం, అధికారులకు మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక, ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతులను అధోగతి పట్టిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వారం రోజులు క్రితం వరి ధాన్యం తీసుకువచ్చిన దానిని తూకం వేసి కొనే నాధుడే లేకుండా పోయాడు.గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోగా, మళ్లీ సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం మళ్లీ తడవడం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement