Breaking News

ఇటు ఏలూరు... అటు కాకినాడలో మావోల అరెస్ట్


Published on: 18 Nov 2025 18:03  IST

ఏపీలో మావోయిస్టుల కలకలం రేగింది. అల్లూరి సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి అడువుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దొరికిన డైరీ ఆధారంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని కొత్త ఆటోనగర్‌లో దాదాపు 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బిల్డింగ్‌లో ఉన్నట్లు పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలు, జిల్లా పోలీసులు అక్కడకు చేరుకుని మావోయిస్టులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి