Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి


Published on: 21 Nov 2025 14:15  IST

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు దగ్గరుండి ఆమెకు స్వామివారి దర్శనం చేయించారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ.. శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు.అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సాదరంగా అహ్వానించారు.

Follow us on , &

ఇవీ చదవండి