Breaking News

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఫిర్యాదు..


Published on: 27 Nov 2025 16:02  IST

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. గాంధీ భవన్‌లో గురువారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై.. ప్రజల సమస్యలు వింటున్నారు. ఈ సందర్భంగా70 ఏళ్ల వృద్ధుడు మంత్రుల ఎదుట తన సమస్యను విన్నవించుకున్నాడు.ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తన దగ్గర నుంచి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపించాడు.

Follow us on , &

ఇవీ చదవండి