Breaking News

ములక్కాయలు చూస్తే కొనే మూడ్ పోతుంది..


Published on: 02 Dec 2025 17:39  IST

మునగకాయలు.. పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వటంలో ఇవి అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయి. శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, విటమిన్ C పుష్కలంగా వీటివల్ల లభిస్తుంది. ఐతే ఇపుడు మునగకాయలు మార్కెట్‌లో కొండెక్కి కూర్చున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో 350 రూపాయలు ధర పలుకుతుంది. మునగ పంట సరిగ్గా కాయకపోవడంతో.. ధర అమాంతం పెరిగిపోయింది. దీంతో ఒక్కో కాయ రూ . 40ల వరకు పలుకుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి