Breaking News

బాలుడి ప్రాణం తీసిన అపనింద


Published on: 03 Dec 2025 14:57  IST

పామర్రు మండలం యడదిబ్బ గ్రామంలో కైలే యశ్వంత్ అనే 15 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం ఆరోపణతో యశ్వంత్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తమ ఇంట్లో రూ.1500 కాజేసాడంటూ పొరుగింట్లో ఉండేవాళ్లు బాలుడిపై ఆరోపణలు చేశారు. తమ ఇంట్లో ఏది పోయిన నీదే బాధ్యత అంటూ బాలుడికి బెదిరించినట్లు సమాచారం. పొరుగింటి వారి బెదిరింపులతో యశ్వంత్ భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి