Breaking News

జ్యూరిక్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం


Published on: 20 Jan 2026 13:05  IST

దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జ్యూరిక్‌ విమానాశ్రయంలో దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. చంద్రబాబు కు స్విస్‌లో భారత రాయభారి మృదుల్‌ కుమార్‌ స్వాగతం పలికారు. సింగపూర్‌ దేశాధ్యక్షుడు ధర్మన్‌ షణ్ముగరత్నం, అస్సోం సీఎం హేమంత్‌ విశ్వశర్మ, ప్రపంచబ్యాంకు గ్రూప్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ బంగా తదితరులు విమానాశ్రయంలోనే చంద్రబాబును కలిశారు. భారీగా ప్రవాసాంధ్రులు విమానాశ్రయానికి తరలివచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement