Breaking News

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు


Published on: 23 Jan 2026 16:13  IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఘన నివాళులు అర్పించారు. నేతాజీ పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీకగా నేటికీ చెప్పుకుంటున్నామని, నేతాజీ అంటూ ఎక్స్‌లో సీఎం, మంత్రి పోస్టు చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌. ఆయన 129వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement