Breaking News

చిక్కినట్టే చిక్కి.. తప్పించుకున్న పులి


Published on: 27 Jan 2026 12:26  IST

ఏలూరు జిల్లా ఏజెన్సీవాసులను ఇంకా పులి భయం వీడలేదు.పులి కదలికలను పరిశీలించేందుకు అటవీ అధికారులు తోటచుట్టూ ట్రాప్‌ కెమెరాలను అమర్చారు. దాన్ని బంధించేందుకు బోన్లు సిద్ధం చేశారు.దీంతో పులి దాదాపు చిక్కినట్టేనని అంతా భావించారు.అయితే సోమవారం సాయంత్రం వరకు మొక్కజొన్న తోటలోనే ఉన్న పులి ఆపై బిల్లిమిల్లి,మర్రిగూడెం గ్రామాల వైపునకు వెళ్లినట్టు అడుగు జాడలను బట్టి సోమవారం ఉదయం గుర్తించారు.డ్రోన్‌తో దాని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement