Breaking News

నిషేధిత సిగరెట్ల రాకెట్‌ గుట్టురట్టు


Published on: 27 Jan 2026 14:17  IST

కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత, అన్‌ బ్రాండెడ్‌ సిగరెట్ల రాకెట్‌ గుట్టును విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు రట్టు చేశారు. సోమవారం దాడులు నిర్వహించి సుమారు రూ.1.75 కోట్లు విలువ చేసే అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. తూరంగి బైపాస్‌ రోడ్డు సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా సిగరెట్‌ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జీఎస్టీ, లీగల్‌ మెట్రాలజీ, ఇంద్రపాలెం పోలీసు లు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement