Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాబలం లేదు..


Published on: 27 Jan 2026 15:42  IST

వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాబలంలేదని రాష్ట్ర మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం వర్ధన్నపేట మున్సిపలిటి 10 డివిజన్‌ మాజీ కౌన్సిలర్‌ తుమ్మల రవీందర్‌ సహా మరో 50మంది బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరందరికి దయాకర్‌రావు బిఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా కేసిఆర్‌ వైపు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండ ప్రజలలో విశ్వాసం కోల్పోతుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి