Breaking News

వివాదంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే


Published on: 29 Jan 2026 12:38  IST

జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరవ శ్రీధర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగిని ఒకరు వీడియో విడుదల చేశారు. అయితే... ఆ మహిళే తన కుమారుడిని వేధిస్తోందంటూ ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్‌ గెలిచినప్పుడు తాను అభినందిస్తూ ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పెట్టానని... ఆ తర్వాత ఆయన తనతో ఫోన్‌లో మాట్లాడారని సదరు ఉద్యోగిని వీడియోలో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement