Breaking News

పీవీ నరసింహారావుకు భారతరత్న.. కేంద్రానికి KCR ధన్యవాదాలు

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న పొందడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్‌ను గౌరవించి పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.


Published on: 09 Feb 2024 17:36  IST

తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ నరసింహారావుకు చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం భారత రత్న పొందడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా దేశం కోసం, దేశాభివృద్ధి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో.. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ పురోగతికి పీవీ నరసింహారావు పునాదులు వేశారని ప్రశంసించారు.

Follow us on , &

ఇవీ చదవండి