Breaking News

అభయారణ్యంలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ చర్యలు

అడవిలో నివసించే వన్యప్రాణులు దాహార్తితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటి కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.


Published on: 02 Apr 2025 14:12  IST

ఏటూరునాగారం: రోజురోజుకు ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో, అడవిలో నివసించే వన్యప్రాణులు దాహార్తితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటి కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

 ప్రత్యేక సాసర్ పీట్స్, నీటి కులాయిల నిర్మాణం
 అడవిలో 100 సౌర బోర్ల ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న అభయారణ్యాల్లో నెమళ్లు, కోతులు, కొండెంగలు, అడవి దున్నలు, దుప్పులు, జింకలు, గుడ్డేలుగులు వంటి జంతువులు అధికంగా సంచరిస్తుంటాయి. ఈ జంతువుల కోసం వాటికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి, తగిన నీటి వసతిని కల్పించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది.

వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత

ప్రతి వేసవికాలంలో నీటి ఎద్దడి వల్ల అడవి జంతువులు జనావాసాల వైపు రాకపోకలు సాగిస్తుండటంతో, వాటి భద్రతకు ప్రత్యేక ప్రణాళికలు అమలులోకి తీసుకువచ్చారు. సౌర బోర్లు, నీటి కులాయిల ఏర్పాటుతో వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా చూడటం అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి