Breaking News

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కల్తీ కల్లును అరికట్టాలని ఆదేశించినా.. ఫలితం లేకుండా పోయింది.

కల్తీ కల్లును తయారుచేస్తూ పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిషేధిత ఉత్ప్రేరకాల నుంచి తయారుచేసిన కల్లును విక్రయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.


Published on: 02 Apr 2025 16:39  IST

ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు దందా...

ఉమ్మడి జిల్లాల్లో కల్తీ కల్లు వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి నిషేధిత రసాయనాలతో కల్తీ కల్లు తయారు చేస్తూ పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.ఈ కల్తీ కల్లు తాగిన వారు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొందరు మానసికంగా బలహీనపడిపోతే, వారి కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కల్తీ కల్లు నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, ప్రతిఫలం కనిపించడం లేదు.

కాంపౌండ్లలో కల్తీ కల్లు విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నాయి. కల్లు డిపోల్లోనూ ఈ దందా నడుస్తున్నా, ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ కల్లు దందాపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదు.

ప్రత్యేకంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ అక్రమ వ్యాపారం అడ్డూఅదుపులేకుండా కొనసాగుతోంది, ఇది ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి