Breaking News

దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఆఫీస్‌ స్పేస్‌ ఖాళీలు. ఆ తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉన్నాయి.

ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కినెడుతూ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లో దూసుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరానికి ఇప్పుడు డిమాండ్‌ కనిపించడం లేదు.


Published on: 02 May 2025 12:21  IST

హైదరాబాద్‌, మే 2: ఒకప్పుడు దేశవ్యాప్తంగా కార్యాలయ స్థలాలకు అత్యధికంగా గిరాకీ ఉన్న హైదరాబాద్‌ నగరంలో ఇప్పుడు ఆ స్థితి కనిపించడం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ పెద్ద సంస్థలు ఆఫీసుల ఏర్పాటుకు ఆసక్తి చూపిన ఈ నగరంపై తాజాగా డిమాండ్‌ తగ్గిపోయింది. తాజా నివేదికల ప్రకారం, హైదరాబాద్‌లో ఇప్పుడు పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాలు ఖాళీగా ఉన్నాయి.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్‌ సంస్థ ‘వెస్టియన్’ నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం — దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా 284 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఖాళీగా ఉంది. మొత్తం అందుబాటులో ఉన్న 1,620 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలంలో ఇది 17.5 శాతానికి సమానం. అంటే ప్రతి 100 చదరపు అడుగుల్లో 17 చదరపు అడుగులు వినియోగం లేకుండా ఉండిపోతున్నాయి.అంతేకాక, గతంలో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కార్యాలయ నిర్మాణాలు వేగంగా సాగేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రదేశాలకు సరైన డిమాండ్ లేకపోవడంతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంపై అభిరుచి తగ్గిపోయింది. దీంతో ఆఫీస్ నిర్మాణ రంగంతో పాటు, సిమెంట్, ఉక్కు, ఇతర అనుబంధ వ్యాపారాలు కూడా ప్రభావితమవుతున్నాయి.

ఈ పరిస్థితులు కొనసాగితే, నిర్మాణ రంగంపై ఆధారపడి జీవించే కూలీలు, సాంకేతిక నిపుణులు, చిన్న వ్యాపారాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు 19 శాతం వరకు ఖాళీలు ఉండినప్పటికీ, కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో ఇప్పుడు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే డిమాండ్ తిరిగి ఎలా రానుందో చూడాలి.

Follow us on , &

ఇవీ చదవండి