Breaking News

సూర్యాపేట జిల్లా నేలమర్రిలో ఒక స్కూలు బస్సు చెరువులోకి దూసుకువెళ్లింది.

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని నేలమర్రిలో ఒక స్కూలు బస్సు చెరువులోకి దూసుకువెళ్లింది.


Published on: 13 Oct 2025 18:32  IST

2025 అక్టోబర్ 13వ తేదీన ఉదయం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని నేలమర్రిలో ఒక స్కూలు బస్సు చెరువులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో బస్సు చెట్టుకు అడ్డుపడటంతో పెను ప్రమాదం తప్పింది.

వల్లభాపురంలోని సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన స్కూలు బస్సు.నేలమర్రి నుంచి 15 మంది విద్యార్థులతో పాఠశాలకు బయలుదేరిన బస్సు, చెరువు కట్టపైకి రాగానే  ఎదురుగా మరో వాహనం రావడంతో బస్సు  అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది.

బస్సు చెరువు కట్ట అంచున ఉన్న ఒక భారీ వృక్షానికి అడ్డుపడటంతో నీటిలోకి పూర్తిగా మునిగిపోకుండా ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు.

బస్సులోని విద్యార్థులు, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి