Breaking News

జగిత్యాల భార్యే భర్తను హత్య చేసింది

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజుపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వచ్చిన వార్తలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Published on: 18 Nov 2025 11:24  IST

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజుపల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడిని ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటకు చెందిన మండపల్లి భూమేష్ (31) గా గుర్తించారు. ఇది హత్య కేసుగా తేలింది. 

భూమేష్‌కు కొత్తదాంరాజుపల్లికి చెందిన విజయతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతుండటంతో విజయ తన తల్లిగారి ఇంట్లో ఉంటోంది. ఆదివారం (నవంబర్ 16, 2025) భూమేష్ భార్యను కాపురానికి పంపించాలని కోరుతూ అత్తింటికి వచ్చాడు. అక్కడ భార్య, అత్తతో గొడవపడ్డాడు.ఈ గొడవ అనంతరం యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇది హత్యగా పోలీసులు నిర్ధారించారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూమేష్ కుటుంబ సభ్యులు అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేయగా, ఇది హత్యేనని నిర్ధారించారు. 

Follow us on , &

ఇవీ చదవండి