Breaking News

అత్తాపూర్‌లో జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తి 

హైదరాబాద్‌లోని అత్తాపూర్ (రంగారెడ్డి జిల్లా) ప్రాంతంలో 2025, డిసెంబర్ 30న జింక మాంసం విక్రయిస్తున్నారనే వార్త తీవ్ర జింక మాంసం సృష్టించింది.


Published on: 30 Dec 2025 15:59  IST

హైదరాబాద్‌లోని అత్తాపూర్ (రంగారెడ్డి జిల్లా) ప్రాంతంలో 2025, డిసెంబర్ 30న జింక మాంసం విక్రయిస్తున్నారనే వార్త తీవ్ర కలకలం సృష్టించింది.

అత్తాపూర్‌లోని సులేమాన్ నగర్‌లో జింక మాంసం విక్రయిస్తున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్‌వోటీ (SOT) పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి నుంచి దాదాపు 15 కిలోల జింక మాంసం, జింక చర్మం (తోలు), తల మరియు రూ. 3,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పెబ్బేరు ప్రాంతం నుండి ఈ మాంసాన్ని నగరానికి తీసుకువచ్చి, ఇక్కడ కిలో రూ. 800 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.నిందితుడిని తదుపరి విచారణ కోసం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. అతనిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 కింద కేసు నమోదు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement