Breaking News

అత్తతో కలిసి మేనల్లుడు మేనమామను హత్య

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి  మండలం సీత్యాతండాలో అత్తతో కలిసి మేనల్లుడు మేనమామను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన.


Published on: 29 Jan 2026 11:21  IST

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి  మండలం సీత్యాతండాలో అత్తతో కలిసి మేనల్లుడు మేనమామను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన 2026, జనవరి 29 వెలుగులోకి వచ్చింది. రమావత్ రవి (34), వేములపల్లి మండలంలోని సల్కునూరు PACSలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.రవి భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు (రవి మేనల్లుడు) గణేష్.లక్ష్మికి, ఆమె భర్త అక్క కుమారుడైన గణేష్‌కు మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయంలో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి.

జనవరి 26న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. మరుసటి రోజు రాత్రి లక్ష్మి, గణేష్ కలిసి రవిపై దాడి చేసి తలకు తీవ్రగాయాలు కలిగించి చంపేశారు. మరుసటి రోజు ఉదయం రవి తండ్రి లక్ష్మానాయక్ తన కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

హత్య అనంతరం నిందితురాలు లక్ష్మి మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి