Breaking News

కొత్తగూడెం చొప్పాల వద్ద భారీ రోడ్డు ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2026 ఏప్రిల్ 16న కరకగూడెం మండలం చొప్పాల వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.


Published on: 16 Apr 2026 14:43  IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చొప్పల వద్ద 2026 ఏప్రిల్ 16న (బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత) జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 

అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన పదిమంది ఒకే ఆటోలో మేడారానికి బయలుదేరారు. కరకగూడెం మండలం చొప్పల సమీపంలోకి రాగానే, వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఒక చెట్టును ఢీకొని బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్ నాగరాజు కాళ్లు, చేతులకు బలమైన గాయాలైనట్లు సమాచారం.క్షతగాత్రులను వెంటనే మణుగూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి