Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల విలేకరుల సమావేశంలో అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని మండిపడ్డారు.


Published on: 28 Mar 2025 15:08  IST

శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కడిగేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు సమాచారం అందిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణ అప్పులు రూ. 4.42 లక్షల కోట్లు మాత్రమేనని, అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆ సంఖ్యను రూ. 8 లక్షల కోట్లుగా చూపిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అబద్ధాల ద్వారా అధికారంలోకి వచ్చిందని, అయినా ఇప్పటికైనా నిజం చెప్పి తప్పును ఒప్పుకుంటే మంచిదని సూచించారు.

కాళేశ్వరం బ్యారేజీల భద్రతపై జరుగుతున్న అసత్య ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇరిగేషన్ మంత్రి స్వయంగా మండలిలో స్పష్టం చేశారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. రాష్ట్రానికి నీళ్లు అందించడంలో విఫలమైన కాంగ్రెస్ తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజా స్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు బయటపెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభను భారీగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ విజయోత్సవాలను ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి