Breaking News

యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి

అనుమానాస్పద మృతి రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.కొత్తూరు శివారులోని ఒక పరిశ్రమ సమీపంలో నివాసం.


Published on: 01 Dec 2025 16:18  IST

అనుమానాస్పద మృతి రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.కొత్తూరు శివారులోని ఒక పరిశ్రమ సమీపంలో నివాసం.మృతి చెందిన యువతి, యువకుడు బిహార్‌కు చెందిన వలస కార్మికులు. యువతి, ఆమె సోదరి స్థానిక బిస్కెట్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వారి తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం యువతి తండ్రి ఇంటికి రాగా, తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలోంచి తలుపు గడియ తీసి లోపలికి వెళ్లి చూడగా యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి