Breaking News

సెలవుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన జర్మన్ యువతి పై అత్యాచారం.

జర్మనీకి చెందిన 25 ఏళ్ల యువతి, హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితుడిని కలుసుకునేందుకు వారం రోజుల క్రితం నగరానికి వచ్చింది. సోమవారం నాడు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో పలు ప్రదేశాలను సందర్శించింది.


Published on: 01 Apr 2025 17:48  IST

హైదరాబాద్‌లో జర్మన్ యువతిపై దారుణం..

హైదరాబాద్‌లో ఓ జర్మన్ యువతిపై లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం (మార్చి 31) రాత్రి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఓ కారు డ్రైవర్ ఆమెను తన వాహనంలో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసుల సమాచారం ప్రకారం, జర్మనీకి చెందిన 25 ఏళ్ల యువతి, హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితుడిని కలుసుకునేందుకు వారం రోజుల క్రితం నగరానికి వచ్చింది. సోమవారం నాడు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో పలు ప్రదేశాలను సందర్శించింది.

సోమవారం రాత్రి తన స్నేహితులను డ్రాప్ చేసి ఎయిర్‌పోర్ట్‌కు వెళుతుండగా కారు డ్రైవర్ అదును చూసి మామిడిపల్లి వద్ద ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన అనంతరం, బాధితురాలు మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఈ కేసును పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి