Breaking News

కెనడాలోని సర్రే నగరంలో గల ఒక పార్క్‌లో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 40 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు

కెనడాలోని సర్రే నగరంలో గల ఒక పార్క్‌లో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 40 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జగేందర్ కురానా గా పోలీసులు గుర్తించారు.


Published on: 19 Aug 2026 11:34  IST

కెనడాలోని సర్రే నగరంలో గల ఒక పార్క్‌లో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 40 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జగేందర్ కురానా గా పోలీసులు గుర్తించారు.

ఆగస్టు 9, 2026 రాత్రి 8:11 గంటల సమయంలో బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో ఉన్న బేర్ క్రీక్ పార్క్ లో ఈ ఘటన జరిగింది.పార్క్‌లో ఉన్న ఒక యువతిని నిందితుడు అసభ్యకరంగా తాకి , అక్కడి నుండి పారిపోయాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో యువతికి ఎలాంటి శారీరక గాయాలు కాలేదు.

పోలీసుల దర్యాప్తు , అరెస్ట్: బాధితురాలు ఇచ్చిన నిందితుడి శారీరక రూపురేఖల ఆధారంగా సర్రే పోలీస్ సర్వీస్ (SPS) వారు నిందితుడి ఫోటోలను విడుదల చేసి, ప్రజల సహాయం కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆగస్టు 12 జగేందర్ కురానాను అరెస్ట్ చేశారు.

నమోదైన కేసులు: నిందితుడిపై కెనడియన్ క్రిమినల్ కోడ్ కింద లైంగిక వేధింపులు మరియు లైంగిక జోక్యం అనే రెండు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement