Breaking News

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో తెల్లవారుజామున బార్‌లో జరిగిన కాల్పుల్లో నిందితుడితో సహా ముగ్గురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. 

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌ (Austin)లో మార్చి 1, 2026 (ఆదివారం) తెల్లవారుజామున ఒక బార్‌లో జరిగిన కాల్పుల్లో నిందితుడితో సహా ముగ్గురు మరణించగా, 14 మంది గాయపడ్డారు.


Published on: 02 Mar 2026 10:59  IST

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌ (Austin)లో మార్చి 1, 2026 (ఆదివారం) తెల్లవారుజామున ఒక బార్‌లో జరిగిన కాల్పుల్లో నిందితుడితో సహా ముగ్గురు మరణించగా14 మంది గాయపడ్డారు

ఆస్టిన్ నగరంలోని వినోద కేంద్రమైన 'సిక్త్స్ స్ట్రీట్' (6th Street) సమీపంలో ఉన్న 'బ్యూఫోర్డ్స్' (Buford's) అనే పాపులర్ బీర్ గార్డెన్/బార్ వద్ద ఈ ఘటన జరిగింది.స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:00 గంటలకు కాల్పులు జరిగాయి.

పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో 53 ఏళ్ల నిందితుడు న్డియాగా డయాగ్నే (Ndiaga Diagne) హతమయ్యాడు. ఇతను సెనెగల్‌లో జన్మించి అమెరికా పౌరసత్వం పొందిన వ్యక్తిగా గుర్తించారు.కాల్పుల్లో గాయపడిన 14 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందేమోనని FBI దర్యాప్తు చేస్తోంది. నిందితుడు ఇరాన్ జాతీయ జెండా గుర్తు ఉన్న దుస్తులు ధరించి ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి