Breaking News

ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది? శ్రీ కృష్ణుడు దాన్ని ఎందుకు ఆపలేదో తెలుసా?

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం ఆయన నిర్యాణం తరువాత సముద్రగర్భంలో కలిసిపోయింది. అయితే ఇవన్నీ ఒట్టి నమ్మకాలే అని కొట్టిపారేసే నాస్తికవాదులకు ఆర్కియాలజిస్టులు పరిశోధించి చెప్పిన నిజాలు చెంపపెట్టు లాంటివి.


Published on: 20 Mar 2025 01:43  IST

ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది?

ద్వారక నగరాన్ని సముద్ర గర్భంలో మునిగిపోయేలా చేసిన మహాప్రళయం ఏలా జరిగింది? ఇప్పటికీ ద్వారక అవశేషాలు సముద్ర గర్భంలో ఉన్నాయా? అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

ద్వారక - మోక్ష ప్రదేశం

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే సప్త మోక్షధామాలలో ద్వారక ఒకటి. "ద్వారక" అంటే అనేక మోక్ష ద్వారాలు కలిగిన ప్రదేశం అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారతం లో ద్వారకా నగరాన్ని "ద్వారావతి" అని పేర్కొన్నారు. గుజరాత్‌లోని పశ్చిమ తీరం వద్ద ఉన్న ఈ నగరం, పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో నిర్మించబడింది.

పురాణ కథనాల్లో ద్వారక

శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు.అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు.

అందమైన ద్వారక నగరం

గోమతీ నది తీరాన కట్టిన ఈ నగరం అద్భుతమైన కట్టడాలతో, ప్రకృతి సోయగాలతో ఆకర్షణీయంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత, ద్వారక మహాప్రళయంలో సముద్ర గర్భంలో కలిసిపోయింది.

ద్వారక నాశనం - అసలు కారణం?

శ్రీకృష్ణుని నిర్యాణం అనంతరం, యాదవ వంశీయులు పరస్పరం కలహించుకుని నాశనం అయ్యారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంఘటన అనంతరం, ద్వారకపై భారీ సముద్ర ప్రవాహం వచ్చి నగరాన్ని ముంచెత్తింది.

నేటికీ ద్వారక గలదా?

ప్రాచీన ద్వారక నగరానికి సంబంధించి కొందరు పరిశోధకులు సముద్ర గర్భంలో నిధులు, శిల్ప కళావశేషాలను కనుగొన్నట్లు చెబుతున్నారు. ఇది ద్వారక నిశ్చయంగా సముద్రంలో మునిగిపోయిన పురాతన నగరమని కొందరు నమ్ముతారు.

ఈ మహాప్రళయం పురాణగాధా? లేక చారిత్రక సత్యమా? అన్నది ఇంకా పరిశోధనలోనే ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి