Breaking News

వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతున్న కర్నూలు క్రీడాకారుడు

పేదరికం జయించి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సత్తా చాటుతున్న కర్నూలు జిల్లా క్రీడాకారుడు. ఆల్ ఇండియా యూనివర్సిటీ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో షేక్ అబ్దుల్లా కు మూడవ స్థానం.


Published on: 23 Feb 2024 18:44  IST

కర్నూల్ పట్టణంలోని శ్రీలక్ష్మి కళాశాలలో బిపిఈడి (BPED)మొదటి సంవత్సరం చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఎంతో ఆసక్తి పెంచుకున్న అబ్దుల్లా ఆటుచదువుతోపాటు ఇటు క్రీడలలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. క్రీడలపై ఉన్న ఆసక్తితో వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఎంచుకొని గత ఆరు సంవత్సరాలుగా కర్నూల్ పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్ యూసఫ్ భాష ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణించాలంటే ఎంతో బలమైన దేహధారుడ్యం,శారీరకంగానూ మానసికంగానూ చాలా బలంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు కూడా పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
 

Follow us on , &

ఇవీ చదవండి