Breaking News

ఏపీ హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.


Published on: 26 Oct 2023 11:14  IST

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు దాఖలు బెయిల్, మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) శుక్రవారం విచారణ జరపనుంది. న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు శుక్రవారం 8వ కేసుగా ఈ బెయిలు పిటిషన్‌ విచారణ జాబితాలోకి వచ్చింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 తర్వాత కానీ, వచ్చే నెల 8లోపు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పైనా వచ్చే నెల 9న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. క్వాష్ పిటిషన్‌పై కోర్టు తీర్పును వెల్లడిస్తే ఈ కేసులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

Follow us on , &

Source From: samayam

ఇవీ చదవండి