Breaking News

మోదీ ఈ దీపావళిను గోవాతీరంలో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం దీపావళి వేడుకలను గోవా తీరంలో భారత నౌకాదళ సిబ్బందితో కలిసి జరుపుకోనున్నారు.


Published on: 16 Oct 2025 14:58  IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం దీపావళి వేడుకలను గోవా తీరంలో భారత నౌకాదళ సిబ్బందితో కలిసి జరుపుకోనున్నారు. గోవా తీరంలో, ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకలో ఈ వేడుకలు జరిగే అవకాశం ఉంది.పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ విజయవంతమైన సందర్భంగా ప్రధాని ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ ప్రతి సంవత్సరం సాయుధ దళాల సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకుంటున్నారు. ఇది ఆయన కొనసాగిస్తున్న సంప్రదాయం. 

గత సంవత్సరాల్లో మోదీ జవాన్లతో జరుపుకున్న దీపావళి వేడుకలు 2024లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో సరిహద్దులో ఉన్న భద్రతా దళాలతో జరుపుకున్నారు.2023లో హిమాచల్ ప్రదేశ్‌లోని లచ్ఛెన్ లోయలో జవాన్లతో గడిపారు.2014లో సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులతో కలిసి తొలిసారిగా దీపావళి జరుపుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి